telugu navyamedia
తెలంగాణ వార్తలు

రేవంత్‌రెడ్డి నన్నుఅనవసరంగా రెచ్చగొట్టవద్దు.. మీరు అనే ప‌దాన్ని వెన‌క్కి తీసుకోవాలి..

*నేను కాంగ్రెస్ పార్టీలో ప‌నిచేసే స‌మ‌యానికి రేవంత్‌రెడ్డి పుట్ట‌లేదు..
*కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్పుడూ మోసాలు చేయ‌లేద‌ని,క‌ష్ట‌ప‌డి కంట్రాక్టులు చేసి సంపాదించాం
*రాజ‌గోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయ‌న్ని విమ‌ర్శించాలి..
*నేను క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ వాదిని..
*రేవంత్‌రెడ్డి క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి..
*మీరు అనే ప‌దాన్ని వెన‌క్కి తీసుకోవాలి..

కాంగ్రెస్ కోమటిరెడ్డి కుటుంబానికి ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీగా పదవులు ఇవ్వడంతో పాటు కుటుంబ సభ్యులకు కూడా పార్టీ పదవులు ఇచ్చింది. అవన్నీ మర్చిపోయి బ్రాండ్ బ్రాండ్ అని ఎగురుతున్నారు. కాంగ్రెస్ ఆదరించకపోతే బ్రాందీ షాపుల్లో పని చేయడానికి కూడా పనికిరారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. 

నేషనల్ హెరాల్డ్ ఆఫీసును ఈడీ సీజ్ చేయడంపై ఢిల్లీలో ఎంపీలు ధర్నా చేశారు. ఈ ధర్నాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. అక్కడ మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన సోదరుడి పార్టీ మార్పు గురించి మాట్లాడేందుకు నిరాకరించారు. క‌ష్ట‌ప‌డి కంట్రాక్టులు చేసి సంపాదించామ‌ని అన్నారు. తన పేరు వెంకటరెడ్డి అని ఏమైనా ఉంటే రాజగోపాల్ రెడ్డినే అడగాలని తేల్చేశారు.

నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌కు సీల్ చేస్తే నిరసన వ్యక్తం చేయడానికి తెలంగాణలో ఉన్న ముగ్గురు ఎంపీల్లో తాను ఒక్కడినే వచ్చానన్నారు. మిగతా ఎంపీలు ఏమయ్యారని ప్రశ్నించారు. రేవంత్, ఉత్తమ్ ఎందుకు రాలేదన్నారు. నేను క‌రుడుగ‌ట్టిన కాంగ్రెస్ వాదిని అని అన్నారు.

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారితే ఆయనను విమర్శించాలి కానీ.. రేవంత్ కుటుంబాన్ని విమర్శించారని మండిపడ్డారు. మీరు అని అని రేవంత్ రెడ్డి అన్నారని..అలా అనడం వల్ల కుటుంబాన్ని టార్గెట్ చేసినట్లయిందని కోమటిరెడ్డి చెబుతున్నారు.

బ్రాందీషాపులు పెట్టుకునేవాళ్లమని ఇష్టమొచ్చినట్లు మాట్లాడారని, కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఎప్పుడూ మోసాలు చేయ‌లేద‌ని,క‌ష్ట‌ప‌డి కంట్రాక్టులు చేసి సంపాదించామ‌ని అన్నారు. వెంటనే ఆయన తన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

మీరు అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలన్నారు తనను అనవసరంగా రెచ్చగొట్టవద్దని..  తాను ఒక్క మాట కూడా పడనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చెబితే అది చేస్తానని…కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాము కష్టపడి కాంట్రాక్టులు  చేసి సంపాదించుకున్నామని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. తాను కాంగ్రెస్ పార్టీలో పని చేసే సమయానికి రేవంత్ రెడ్డి పుట్టలేదన్నారు.

 

Related posts