telugu navyamedia
సినిమా వార్తలు

విజయ్ దేవరకొండ ల‌వ్ బ్రేకప్‌..

సినీ ఇండ‌స్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఉన్న క్రేజ్ ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు..ఆయ‌న స్టైల్ యూత్ కి ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. అమ్మాయిల‌కు ఆయ‌నంటే పిచ్చి..అయితే ఇటీవలే తన హార్ట్‌ బ్రేక్‌ అయ్యిందని చెప్పాడు.

Pushpaka Vimanam Movie (2021): Cast | Songs | Teaser | Poster | Trailer | Release Date - News Bugz

ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటించిన సినిమా ‘పుష్పక విమానం. దామోదర దర్శకత్వం దామోదర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి విజయ్‌ నిర్మాతగా వ్యవహరించారు. నవంబర్‌ 12న ఈసినిమా విడుదల కానున్న నేపథ్యంలో దేవరకొండ బ్రదర్స్‌ ప్రమోషన్స్‌లో బిజీ అయిపోయారు.

.

తాజాగా తమ గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్‌ చేసిన పలు ప్రశ్నలకు దేవరకొండ బ్రదర్స్‌ సమాధానాలు ఇచ్చారు.ఇందులో భాగంగా అర్జున్‌ రెడ్డి హీరో విజయ్‌ దేవరకొండ డేటింగ్‌లో ఉన్నారా? సింగిలా? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ‘ఈ మధ్యే నా హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది. అందుకే కొంచెం బాధలో ఉన్నా’ అని తెలిపాడు.

Vijay, Anand Deverakonda answer questions about Pushpaka Vimanam

అంతేకాకుండా ఈ విషయంఇప్పటివరకూ ఆ విషయం ఎవ్వరికీ తెలీదు. అందుకే కొంచెం బాధలో ఉన్నా అని చెప్పుకొచ్చాడు.. మరోవైపు ఆనంద్‌ దేవరకొండ..తాను ఇంకా సింగిల్‌ అంటూ తన రిలేషన్‌షిప్‌ స్టేటస్‌పై క్లారిటీ ఇచ్చాడు.

Related posts