telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవర్ స్టార్ 27వ సినిమా అప్డేట్

Pspk27

సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే. ఈరోజు మెగా అభిమానులకు పండగే అని చెప్పాలి. పవన్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియాలో ఆయనకు ప్రముఖులు, అభిమానుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ పుట్టిన రోజు సందర్బంగా ఇప్పటికే “వకీల్ సాబ్” మూవీ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆ లుక్ కు మంచి స్పందన వస్తోంది. కాగా తాజాగా ఆయన 27వ సినిమా అప్‌డేట్ కూడా వచ్చేసింది. క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న 27వ సినిమా ప్రీ లుక్ విడుదలైంది. చిత్ర యూనిట్ ప్రీ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే ఈ సినిమా టైటిల్ ను మాత్రం ప్రకటించలేదు. ఈ సందర్భంగా దర్శకుడు క్రిష్ “పవన్ కళ్యాణ్ గారు #PSPK27 పదిహేన్రోజుల షూటింగ్ ప్రతిక్షణం టీం అందరికీ గొప్ప జ్ఞాపకంలా కదులుతుంది. చిరస్థాయిగా నిలిచే విజయం కంటికి కనిపిస్తుంది. ఇందుకు కారణం మీరు, మీ ప్రోత్సాహం, మీ సహృదయం. ఎప్పటికీ ఇలాగే కోట్లాది జనం శుభాకాంక్షలు అందుకుంటుండాలని ఆశిస్తూ హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్” అంటూ ట్వీట్ చేశారు.  పవన్ 27వ సినిమాకు సంబంధించి విడుదలైన ప్రీ లుక్‌లో పవన్ చేతికి కడియం, నడుముకి ఎర్రని గుడ్డ కట్టి కన్పిస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రీ లుక్ కు పవర్ స్టార్ ఫాన్స్ నుంచి విపరీతమైన స్పందన వస్తోంది.

Related posts