telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : అజయ్‌ దేవగన్‌ మోషన్‌ పోస్ట్‌ర్‌ రిలీజ్‌

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ టీం నుంచి ఓ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. అజయ్‌ దేవ్‌గణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాలో ఆయన పాత్రను తెలియజేసేలా ఫస్ట్‌లుక్‌ మోషన్‌ పోస్టర్‌ను చిత్ర బృందం రిలీజ్‌ చేసింది. శత్రు సేనలు దేవ్‌గన్‌ను చుట్టుముట్టినట్లు ఉన్న ఈ మోషన్‌ పోస్టర్‌ అద్హుతంగా ఉంది. ఈ పోస్టర్‌లో అజయ్‌ దేవ్‌గణ్‌.. పవర్‌ ఫుల్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్‌ అందరినీ ఎంతోగానే ఆకట్టుకుంటోంది. కాగా.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

Related posts