telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

కళ్లకింద .. వలయాలకు .. ఇదే పరిష్కారం..

remedies to dark circles at eyes

సరిగ్గా నిద్ర లేకపోవటం లేదా ఎక్కువసేపు కంప్యూటర్ తదితర చూస్తూ ఉండటం లాంటివి కళ్ల అడుగున నల్లని వలయాలు ఏర్పడటానికి కారణం అవుతాయి. వాటిని తగ్గించుకోవాలంటే ముందు అవి ఏ కారణం తో ఏర్పడ్డాయో తెలుసుకొని, తదనుగుణంగా సరైన చిట్కాలు పాటించాలి. శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపకపోతే అవి శరీరానికి, చర్మానికి హాని చేస్తాయి. ఆ ప్రక్రియ సజావుగా సాగాలంటే రోజూ కనీసం పది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్లు తాగాలి. కొన్నిసార్లు హిమోగ్లోబిన్‌ శాతం తక్కువగా ఉన్నా నల్లని వలయాలు ఇబ్బందిపెడతాయి. ఎన్ని చిట్కాలు పాటించినా తగ్గకపోతే ఓసారి హిమోగ్లోబిన్‌ శాతాన్ని తెలుసుకునేందుకు రక్తపరీక్ష చేయించుకోవడం మంచిది. తక్కువగా ఉంటే ఇనుము శాతం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి.

పరిస్థితిని బట్టి వైద్యుల సలహాలను పాటించాలి. నిద్రలేమి, ఒత్తిడీ నల్లని వలయాలకు ప్రధానకారణం. వీటిని అదుపులో ఉంచాలంటే… వేళకు నిద్రపోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం. ఒత్తిడి తగ్గాలంటే రోజూ ధ్యానం చేయాలి. ప్రతికూల ఆలోచనల్ని అదుపులో ఉంచుకోవాలి. రోడ్డు వారన దొరికే చిరుతిళ్లు, బేకరీ పదార్థాలు, ఇతర జంక్‌ఫుడ్‌ కూడా ఈ సమస్యకు కారణమవుతాయి. అందుకే వాటన్నింటినీ తగ్గించి, పోషకాహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. పచ్చికూరగాయ ముక్కలు, పండ్లు తీసుకోవాలి. కూరగాయ ముక్కలు చెక్కుతో సహా తింటే మరీ మంచిది.

ఈ సమస్యకు ఇంటి చిట్కాల విషయానికి వస్తే, కొబ్బరినూనెలో కొద్దిగా బాదంనూనె కలిపి కళ్ల చుట్టూ రాసి, నెమ్మదిగా మర్దన చేయాలి. ఇలా రోజుకోసారి చేయడం వల్ల ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. రెండు చెంచాల కొబ్బరిపాలల్లో పావుచెంచా నిమ్మరసం, రెండు చెంచాల కీరదోస తురుము, కొద్దిగా క్రీం, చెంచా ముల్తానీమట్టి కలపాలి. దీన్ని కళ్ల చుట్టూ పూతలా వేసుకోవాలి. ఇరవై నిమిషాల తరువాత కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే చాలు. టమాటా రసాన్ని కళ్ల చుట్టూ రాసుకుని, నెమ్మదిగా మర్దన చేయాలి. పదిహేను నిమిషాల తరువాత కడిగేయాలి. రెండురోజులకోసారి ఇలా చేస్తుంటే మార్పు కనిపిస్తుంది.

Related posts