telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రణరంగం.. తో శర్వానంద్, కాజల్..

sarvanand ranarangam poster

సుధీర్ వర్మ డైరెక్షన్లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా, శర్వానంద్.. కాజల్..కళ్యాణి ప్రియాదర్శన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం రణరంగం. గత కొంతకాలంగా సరైన ప్రమోషన్ లేకపోవడం తో సినిమా ఫై ఏమాత్రం ప్రేక్షకుల్లో ఆసక్తి లేదు. ఇటీవల టైటిల్ తో కూడిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పటికీ పెద్దగా ఆదరణ రాలేదు. దీనితో చిత్ర ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై ఆసక్తి పెంచాలని చిత్ర యూనిట్ ఫిక్స్ అయ్యారు. వచ్చే వారంలో ఫస్ట్ లుక్ ట్రైలర్ విడుదల చేసి సినిమా ఫై బజ్ తీసుకొచ్చేందుకు ఫిక్స్ అయ్యారు.ఆగష్టు 2వ తేదీన సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న తరుణంలో ఈ ట్రైలర్ చిత్ర ఓపెనింగ్స్ కు బాగా ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

ఆ ట్రైలర్ అనుకున్న స్థాయిలో ఉంటుందా అనేది చూడాలి. ఈ సినిమాలో శర్వానంద్ రెండు డిఫెరెంట్ షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు. అందులో ఒకటి యువకుడిగా ఉండే పాత్ర, మరో షేడ్ మధ్య వయస్కుడైన గ్యాంగ్ స్టర్ గా ఉంటుంది. ఈ పాత్ర కోసం శర్వా గడ్డం పెంచి సాల్ట్ అండ్ పెప్పర్ గెటప్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో శర్వా గ్యాంగ్ స్టర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా ఉంటుందని ఇన్సైడ్ టాక్. సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Related posts