telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

కెనడియన్ యువతికి చుక్కలు చూపించిన హార్మోనికా… వీడియో వైరల్

Harmonika

ఓ కెనడియన్ యువతికి హోర్మోనికా చుక్కలు చూపించింది. అంటారియోకు చెందిన ఒబ్రియన్ అనే టీనేజర్‌కు ఈ వింత అనుభవం ఎదురైంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రముఖ సోషల్ మీడియా యాప్ టిక్ టాక్‌లో ప్రత్యక్షం కావడంతో వైరల్ అయింది. ఏకంగా 1.7 మిలియన్ వ్యూస్ వచ్చాయి. పొరపాటున హోర్మోనికా టీనేజర్ నోటిలో ఇరుక్కుపోయింది. అంతే బయటకు తీద్దామని ఎంత ప్రయత్నించినా కుదరలేదు. రెండు దవడల మధ్యలో ఇరుక్కుపోవడంతో యువతికి నోరు మెదపడం కూడా కష్టంగా మారిపోయింది. బాధతో విలవిలలాడిపోయింది. దాంతో చేసేదేమిలేక కుటుంబ సభ్యులు డెంటల్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. దంతవైద్యుడు ఆమె నోటిని ఒక ప్రత్యేక పరికరంతో తెరిచి హార్మోనికాను బయటకు తీశాడు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు.


Video Source: BESTNEWSUSA!

Related posts