telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు వ్యాపార వార్తలు

ఎయిరిండియా .. ప్రైవేటీకరణకు అంతా సిద్ధం..

modi govt decided air india to private

మోడీ సర్కార్‌ ఎయిరిండియాను ఎలాగైనా సరే ప్రైవేట్ పరం చేయాలని నిర్ణయించుకుంది. ఇందుకోసం నూతన ప్రణాళికలు రూపొందించినట్లు సమాచారం. వచ్చే నెల చివరి నాటికి ఎయిరిండియా (ఎఐ) అమ్మకాన్ని పూర్తి చేయడానికి సిద్దం అయినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వారు పేర్కొన్నారు. ఇందుకోసం పెట్టుబడిదారులను ఆకర్షించడానికి పలు దేశాల్లో రోడ్‌షోలు నిర్వహించనున్నారని పేరు చెప్పుకోవడానికి ఆసక్తి చూపని ఓ వ్యక్తి తెలిపారు. ఇందుకోసం చర్చలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికే బిడ్డర్ల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు.

ఈ వ్యవహారంపై ఆర్ధిక మంత్రిత్వ శాఖ, ఎఐ అధికారులు స్పందించడానికి నిరాకరించారు. గతేడాది ఎఐలోని కొంత వాటాను విక్రయించడానికి బిడ్డర్ల నుంచి కేంద్రం దరఖాస్తులు కోరింది. కాని ఎవరూ కొనుగోలుకు ఆసక్తి చూపలేదు. దీంతో ఎఐలో వాటా విక్రయానికి నూతన విధానాన్ని తీసుకుంటామని ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అదే విధంగా పౌర విమానయానంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 100 శాతానికి పెంచారు. ఇంతక్రితం ఈ వాటా 49 శాతంగా ఉందన్నారు.

Related posts