telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“కన్నానులే” సాంగ్ కు డాన్స్ అదరగొట్టిన లావణ్య త్రిపాఠి… వీడియో వైరల్

Lavanya

కథానాయికగా లావణ్యా త్రిపాఠి ‘అందాల రాక్షసి’తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తరువాత ‘భలే భలే మగాడివోయ్’, ‘సోగ్గాడే చిన్ని నాయనా’, ‘శ్రీరస్తు శుభమస్తు’, ‘అర్జున్ సురవరం’ తదితర విజయవంతమైన చిత్రాల్లో అందంతో పాటు అభినయానికి ఆస్కారమున్న పాత్రల్లో ఆమె నటించారు. నటిగా చక్కటి పేరు సొంతం చేసుకున్నారు. దాంతో వైవిధ్యమైన పాత్రలు ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం లావణ్యా త్రిపాఠి తెలుగులో రెండు సినిమాలు చేస్తున్నారు. ఒకటి… ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’. రెండు… ‘చావు కబురు చల్లగా…!’. కాగా తాజాగా ఏఆర్ రెహమాన్ రూపొందించిన “కన్నానులే” పాటకు సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి తన డాన్స్ తో అభినయంతో ఆకట్టుకుంది. లావ‌ణ్య త్రిపాఠి, ఉమంగ్ గుప్తా అట‌వీ ప్రాంతంలో ఈ పాటకు స్టెప్పులేసిన వీడియో ఇపుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్ , మణిరత్నం కాబినేషన్లో వచ్చిన సినిమాల్లో ‘బొంబాయి’ సినిమా ఒకటి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఆల్బ‌మ్ ఆల్ టైమ్ ఫేవ‌రేట్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో అన్ని పాటలు ఎవర్ గ్రీన్ అనే చెప్పాలి.

Related posts