telugu navyamedia
సినిమా వార్తలు

ఆమె నాకు చాలా స్పెషల్… పెళ్ళి వార్తలపై స్పందించిన అర్జున్ కపూర్

Arjun-Kapoor-and-Malaika-Arora-Khan

హాట్ భామ మలైకా అరోరా, బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ గతకొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారని, త్వరలోనే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై అటు అర్జున్ కపూర్ గానీ, మలైకా కానీ స్పందించలేదు. కానీ ఈ వార్తలకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ట్రిప్ లకు వెళ్లడం, సన్నిహితంగా మెలగడంలాంటివి చేస్తూ మీడియా కంట పడేవారు. వీరి ఎఫైర్ పై ఎన్ని వార్తలు వస్తున్నా ఈ జంట మాత్రం సైలెంట్ గానే ఉండడంతో ఆ వార్తలకు ఊతం దొరికినట్లయింది. కొద్దిరోజులుగా ఈ జంట ఏప్రిల్ 18 నుండి 22 మధ్యలో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నట్లు కథనాలు ప్రచురితం అవుతున్నాయి. బాలీవుడ్ కి చెందిన ప్రముఖ మీడియా మలైకాని తన పెళ్లి విషయమై ప్రశ్నించగా స్పందించిన ఆమె అలాంటిదేమీ లేదని, పెళ్లి వార్తలు నిజం కాదని చెప్పింది. కానీ వారి మధ్య బంధం గురించి మాత్రం కామెంట్ చేయలేదు ఈ హాట్ బ్యూటీ.

తాజాగా అర్జున్ కపూర్ కూడా తన పెళ్లికి సంబంధించిన వార్తలపై స్పందించాడు. తన వయసు 33 సంవత్సరాలని, ప్రస్తుతం తను పెళ్లికి రెడీగా లేనని, పెళ్లి గురించి మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని, వివాహం జరిగితే మీకు తెలుస్తుంది కదా… అంటూ మీడియాను ప్రశ్నించారు. మలైకా తన లైఫ్ లో స్పెషల్ పర్సన్ అని చెప్పాడు. ఈ కాలంలో ఏది ఎక్కువ రోజులు దాచలేమని, తప్పుడు వార్తలు సృష్టించం మంచిది కాదని.. తనకు ఏ విషయం దాచాల్సిన అవసరం లేదని, మనకు నచ్చినవారు మన చుట్టూ ఉంటే అంతకంటే కావల్సిదేముంటుందని అన్నారు. ప్రస్తుతం అర్జున్ బాలీవుడ్ లో ‘పానిపట్’, ‘ఇండియాస్ మోస్ట్ వాంటెడ్’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.

Related posts