telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆస్కార్ అందుకున్న సినిమా… కానీ కథ సౌత్ సినిమా కాపీ…!?

Parasite

కొన్ని రోజుల క్రితం ఉత్తమ చిత్రంగా ఆస్కార్‌ అవార్డు అందుకుని ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురిచేసిన కొరియన్‌ సినిమా ‘పారసైట్‌’. బాంగ్ జూన్ హో దర్శకత్వంలో వచ్చిన కామెడీ థ్రిల్లర్ మూవీగా పారాసైట్.. ఏకంగా 4 ఆస్కార్ లను తన ఖాతాలో వేసుకుంది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, బెస్ట్ ఒరిజినల్ స్ర్కీన్ ప్లే, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇలా మొత్తం నాలుగు కేటగిరీల్లో ఆస్కార్ సొంతం చేసుకుంది. విశ్లేషకుల అంచనాలకు కూడా అందకుండా “పారాసైట్” ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకుంది. అకాడమీ అవార్డుల ప్రదానోత్సవంలో థ్రిల్లర్ మూవీ పారాసైట్.. మొత్తం 6 నామినేషన్ల నుంచి బ్రేక్ చేసుకుంటూ ముందుకు దూసుకొచ్చింది. దర్శకుడు బాంగ్, అతని సహ దర్శకులు హాన్ జిన్ ఉత్తమ ఒరిజినల్ స్ర్కీన్ ప్లేకు ఫస్ట్ అవార్డు వరించింది. అయితే ఇప్పుడు పారసైట్ కథ చాలా ఏళ్ల క్రితం తమిళంలో వచ్చిన ‘మిన్సార కన్నా’ కథ ఒక్కటేనన్నది ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. ఒక పేద యువకుడు ధనికుడి ఇంట్లో పనికి చేరి, తన పనితనంతో ఆ కుటుంబం అభిమానాన్ని సంపాదించి, ఆ తరువాత తన బంధువులందర్నీ ఆ ఇంటిలోనే పనికి కుదిర్చి, యజమాని కళ్లుగప్పి భోగభాగ్యాలను అనుభవించే తరహా కథతో ‘పారసైట్‌’ తెరకెక్కింది. తమిళంలో విజయ్‌, రంభ నటించిన ‘మిన్సార కన్నా’ చిత్రం కథ కూడా ఇంచుమించుగా ఇదే. అయితే ‘పారసైట్‌’ సీరియస్‌ సినిమా అయితే, ‘మిన్సార కన్నా’ కామెడీ సినిమా. కథలో సారూప్యతను బట్టి విజయ్‌ అభిమానులు ‘మిన్సార కన్నా’ చిత్రాన్ని మరోసారి ట్రెండింగ్‌లోకి తీసుకొచ్చారు. అంతేకాదు, మన కథని కాపీ కొట్టి ‘పారసైట్‌’ తీశారంటూ పలువురు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. అయితే ఈ ఆరోపణలు చాలా హాస్యస్పదంగా ఉన్నాయంటూ విశ్లేషకులు కొట్టిపారేస్తున్నారు.

Related posts