telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కేటీఆర్‌ గారు… మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది : వర్మ

varma not ready to leave tdp and tarak

సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఎదో ఒక విషయం పై వ్యంగ్యంగా స్పందించడం రాంగోపాల్ వర్మకు అలవాటు. తాజాగా ఆయన ట్వీటర్‌ ద్వారా వేసిన ఓ ప్రశ్నకు మంత్రి కేటీఆర్‌ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ఇక ఆ సమాధానంపై కూడా వర్మ తనదైన శైలిలో రిప్లై ఇచ్చారు. రామ్ గోపాల్ వర్మ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తన తరఫు నుంచి ఓ విజ్ఞప్తి చేసాడు. లాక్ డౌన్ కారణంగా కొన్ని రోజులుగా మద్యం షాపులు అన్నీ మూతపడిపోయాయి. దాంతో కొందరు ఆత్మహత్య చేసుకుంటున్నారు.. మరికొందరు పిచ్చోళ్లైపోతున్నారు. ఇంకొందరు అయితే నిద్రమాత్రలు మింగుతున్నారు. వాళ్లందరూ సెట్ అవ్వాలంటే వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ చేసినట్లు ఆ మందు ఏదో ఇంటింటికి డెలివరీ చేసే మార్గం ఏదో చూడండయ్యా బాబూ అంటూ కేసీఆర్, జగన్‌లకు విజ్ఞప్తి చేసాడు ఆర్జీవీ. దీనికి తెలంగాణ మంత్రి కేటీఆర్ అదిరిపోయే కౌంటర్ ఇచ్చాడు. వర్మ ట్వీట్ చూసిన కేటీఆర్.. రాము గారు మీరు మాట్లాడేది హెయిర్ కటింగ్ గురించే కదా అంటూ రిప్లై ఇచ్చాడు. దాంతో ఆర్జీవీకి పంచ్ పడిపోయింది. కేటీఆర్‌ రిప్లైపై వర్మ తనదైన శైలిలో స్పందించారు. ’కేటీఆర్‌ సర్‌.. నేను మీరు ఇచ్చిన రిప్లైను గుర్తించలేదు. మీలో ఉన్న హాస్య చతురత నాకు చాలా ఇష్టం. మీరు వేసిన పంచ్‌కు నా ముక్కు పచ్చడైపోయింది. ప్రస్తుతం మీ ప్రభుత్వం చేస్తున్న కృషి మరువలేనిది’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం కేటీఆర్, వర్మ మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Related posts