telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

చైనాలో … పాక్ పౌరుల పాట్లు.. తరలించే బడ్జెట్ లేదా లేక వైరస్ భయమా..

deaths increased to 131 due to corona virus

చైనా లో కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తోంది. ఇప్పటికే ఈ వైరస్ సోకి మరణించిన వారి సంఖ్య 259కి చేరింది. ఇంకా 11,791 మంది ఈ వైరస్‌ భారిన పడినట్లు చైనా ప్రభుత్వం ప్రకటించింది. ఈ వైరస్ మూలం అయినటువంటి హుబే ప్రావిన్సు నుంచి తమ పౌరుల్ని స్వదేశాలకు తరిలించేందుకు అన్ని దేశాలు ప్రత్యేక విమానాలు పంపించి తమ పౌరులను తరలించే ఏర్పాట్లు చేస్తున్నాయి. ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ లోని చైనా రాయబారి సన్ వయడాంగ్ మాట్లాడుతూ కరోనా వైరస్ నిర్ధారణ అయిన 218 మంది రోగులు కోలుకున్నారని తెలిపారు. చైనా ప్రభుత్వం ప్రాణాంతక వైరస్‌పై సమర్ధంగా పోరాడటానికి అన్ని వనరులు వినియోగిస్తోందని, దేనినైనా ఎదుర్కోవడానికి చైనా ప్రజలు సంసిద్ధంగా ఉన్నారన్నారు. 31 ప్రావిన్సులు, మున్సిపాల్టీలు, హాంకాంగ్, మకావ్, తైవాన్ ప్రాంతాల్లో ఈ వైరస్ బారినపడినట్లు వయడాంగ్ తెలిపారు.

పాకిస్థాన్ తమ మిత్ర దేశమైన చైనా నుండి తమ పౌరులను తరలిండానికి ఇష్టపడం లేదు. తమకు ఎన్నో విధాలా సాయం అందించిన చైనా నుండి తమ ప్రజలను తరలించి వారిని భాధ పెట్ట దలచుకోలేదని పాకిస్థాన్ ప్రభుత్వం తెలిపింది. జిజియాంగ్ ప్రావిన్సుల్లోని ఉర్‌మిక్ విమానాశ్రయంలో చిక్కుకున్న 150 మంది పాక్ పౌరులు మాత్రం తమను తిరిగి పాకిస్థాన్ కు తీసుకు వెళ్ళవలసిందిగా పాక్ ప్రభుత్వాన్ని వేడుకుంటుంన్నారు. ఇలా ఉండగా పాక్ విద్యార్ధి ఒకరు చైనా లో తమ పరిస్థితిని సోషల్ మీడియాలో ఒక వీడియో ద్వారా తెలిపాడు. పాక్ ప్రభుత్వం విమాన సేవలను చైనా నుండి నిలిపివేసిన కారణంగా తాము అందరం విమానాశ్రయం లోనే చిక్కుకు పోయామని, ఇక్కడ కనీస సౌకర్యాలు కూడా అందడంలేదని, మాలో కొంత మంది వీసా గడువు కూడా ముగిసిపోయింది, తమను వెంటనే పాక్ కు తీసుకు వెళ్ళేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపాడు. స్వదేశానికి వచ్చే తమహక్కును కాల రాయొద్దని ప్రాధేయపడ్డాడు. గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ వైరస్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.

Related posts