telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మూడ్‌ ఆఫ్‌ ది నేషన్ : మొదటి స్థానాల్లో అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె

Akshay

ప్రముఖ మీడియా సంస్థ అత్యంత ప్రజాదరణ గల స్టార్స్ ఎవరనే దానిపై సర్వే చేయగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తొలి స్థానం లో నిలిచారు. ‘మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌’ అనే పేరుతో సదరు సంస్థ ఈ సర్వేను నిర్వహించింది. ఎక్కువ మంది ఇష్టపడే హీరో గా అక్షయ్ 24 శాతం ఓట్లతో మొదటి స్తానం సంపాదించుకున్నాడు. ఇక అదే విధంగా హీరోయిన్స్ లో దీపికా పదుకొనె మొదటి స్థానంలో నిలిచింది. దీపికాకి 16 శాతం ఓట్లు పడగా, ఆమె తర్వాతి స్థానంలో ప్రియాంక 14 ఓట్లతో నిలిచింది. కత్రినా కైఫ్‌-13, ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌-10, అనుష్క శర్మ- 9 శాతం, అలియా భట్‌తో పాటు కంగనా రనౌత్‌ 6 శాతం ఓట్లు వచ్చాయి. కపూర్,‌ ఖాన్‌లకు కేవలం 3 శాతం ఓట్లు వచ్చాయి. ఇక టాప్ 10 జాబితాలో చోటు దక్కించుకున్న హీరోల విషయానికి వస్తే.. అక్షయ్‌ కుమార్‌-24 శాతం, అమితాబ్‌ బచ్చన్‌- 23, షారుఖ్‌ ఖాన్‌- 11, సల్మాన్‌ ఖాన్‌- 10, ఆమిర్‌ ఖాన్‌-6, ఇతరులు- 6 శాతం, అజయ్‌ దేవ్‌గణ్‌-4, హృతిక్‌ రోషన్‌-4, రణ్‌వీర్‌ సింగ్‌-4, రణ్‌బీర్‌ కపూర్‌-2లతో తొలి పది స్థానాలలో నిలిచారు.

Related posts