పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఈ రోజు పవన్‌కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘భీమ్లానాయక్’ నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ‘సెభాష్.. ఆడాగాదు ఈడాగాదు అమీరోళ్ల మేడాగాదు’ అంటూ సాగే ఈ జానపద గీతం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ‘భీమ్లానాయక్’ టైటిల్ సాంగ్‌గా
విడుదలైన ఈ పాట ఎంతగానో అలరిస్తోంది.
మలయాళంలో సూపర్‌హిట్ విజయాన్ని అందుకున్న ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. మాతృకలో బీజుమేనన్ పాత్రను తెలుగులో పవన్‌కల్యాణ్.. పృథ్వీరాజ్ సుకుమార్ పాత్రను రానా పోషిస్తున్నారు. సాగర్ కె.చంద్ర డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో పవర్‌స్టార్ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో
కనిపించనున్నారు. ఐశ్వర్యా రాజేశ్, నిత్యామేనన్ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.