తెలుగులో వస్తున్న “జబర్ధస్త్” కామెడీ షోతో యాంకర్ అనసూయ ఎంత క్రేజ్ సంపాదించిందో అందరికీ తెలిసిందే. ఒకవైపు బుల్లితెర షోలు, మరోవైపు సినిమాలు అంటూ అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయిన అనసూయ ప్రస్తుతం వెండి తెరపై కూడా తన సత్తా చాటుతుంది. అనసూయ యాంకర్ గా పాపులారటీతో పాటు కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే అనసూయ పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లలకు తల్లి అయిన తర్వాత కూడా అనసూయ గ్లామరస్ యాంకర్‌గా రాణిస్తూ దూసుకుపోతోంది. ఇటీవలే అనసూయ ప్రధాన పాత్రలో నటించిన “కథనం” సినిమా విడుదలయింది. ఈ భామ తాజాగా చేసిన పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. సామాజిక బాధ్యత విషయంలో అనసూయ ముందే ఉంటుంది. నిజంగానే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వ తీరును ఈమె తప్పు పట్టింది. దాంతో పాటు కేంద్రంపై కూడా మాటల తూటాలు పేల్చింది. దానికతోడు రెండు తెలుగు రాష్ట్రాల అటవీ శాఖ మంత్రులపై కూడా మండిపడింది. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల కోసం కేంద్రం ఇచ్చిన అనుమతితో ఇప్పుడు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతుంది. దీనికి పవన్ కల్యాణ్ సహా విజయ్ దేవరకొండ, శేఖర్ కమ్ముల లాంటి ఎందరో సినిమా వాళ్లు సపోర్ట్ తెలియచేస్తున్నారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కూడా ఇదే చేసింది. ఈమె కూడా ఇప్పుడు సేవ్ నల్లమల అంటూ ఉద్యమిస్తుంది. తాజాగా ఈమె చేసిన ట్వీట్స్ సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్ర మంత్రులపై మండిపడింది ఈమె. “అడవుల్లోని చెట్లను కొట్టేస్తే రేపటి తరం గాలిని కూడా కొనుక్కొని బతకాల్సిన గతి పడుతుంది కదా… మనం ఏం చేస్తున్నాం.. అభివృద్ధా లేదంటే నాశనమా.. ఏం ఉద్ధరిద్దామని.. మనకు మనం చెంపల మీద కొట్టుకుందాం” అంటూ సెటైర్లు వేసింది అనసూయ.
previous post
జయలలిత బయోపిక్ కు బ్రేక్ వేస్తానంటున్న దీప