telugu navyamedia
సినిమా వార్తలు

రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధిస్తున్న “చిచ్చోరే”

Chichore

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధాకపూర్ హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం “చిచ్చోరే”. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌తో సందడి చేస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినీ కేరీర్‌లోనే “ఎం.ఎస్. ధోని” తర్వాత తొలి వీకెండ్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డు సృష్టించింది. నితేష్ తివారీ దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ సినిమా ఆరు రోజుల్లోనే రూ. 61 కోట్లు రాబట్టింది. ఈ మూవీ త్వరలోనే 100 కోట్ల క్లబ్‌లో చేరుతుందని సినీ విశ్లేషకుడు తరణ్‌ ఆదర్శ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తెలియజేశాడు. వీక్‌ డేస్‌లోనే మంచి కలెక్షన్స్‌ రాబట్టిన ఈ మూవీ వీకెండ్‌లో మరో 40 కోట్లు రాబట్టడం చాలా తేలికని ఆయన అన్నారు. కాగా, శుక్రవారం రెండు క్రేజీ ఫిల్మ్స్‌ రిలీజవుతుండడంతో కాస్త పోటీ ఉంటుందని అన్నారు. శ్రద్ధాకపూర్‌, సుశాంత్‌లు చేసిన ఇంతకు ముందు సినిమాలు “సాహో”, “సాంచీరియా” కాస్త నిరాశ పర్చినప్పటికీ, ఈ సినిమాతో వారికి ఉపశమనం లభిస్తుందన్నాడు.

Related posts