telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కరోనా విజృంభణ : కొత్త యాప్‌ తీసుకువచ్చిన తెలంగాణ ప్రభుత్వం

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ట్రేసింగ్- టెస్టింగ్- ట్రేసింగ్- ట్రీటింగ్ విధానంలో కరోనా కట్టడికి కొత్త ఆప్ రూపొందించింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. PHC స్థాయి వరకు రాపిడ్ యాంటీ జెన్ టెస్ట్ లు చేస్తున్న నేపద్యంలో పాసిటివ్ వచ్చిన వ్యక్తుల కాంటాక్ట్ పర్సన్స్ కి వెంటనే మొబైలు ద్వారా SMS పంపించే విధంగా నూతన ఆప్ రూపకల్పన చేసింది. దీని ద్వారా కాంటాక్ట్ పర్సన్స్ మొబైల్ కి వెంటనే కరోనా పరీక్ష చేయించుకోవాలని ఎస్ఎంఎస్ వెళ్తుంది. దీనివల్ల ట్రేసింగ్ అత్యంత తొందరగా చేయడానికి వీలవుతుంది. లక్షణాలు ఉన్న వారందరూ నిర్లక్ష్యం చేయకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ప్రజలకు మంత్రి ఈటల విజ్ఞప్తి చేశారు. గతంలో కరోనా చికిత్స అందించిన అన్ని ఆసుపత్రులు తిరిగి పూర్తి స్థాయిలో కరోనా అసుపత్రులగా మార్చాలని నిర్ణయం తీసుకున్నామని… 33 జిల్లా కేంద్రాలలోని హాస్పిటల్స్ లో కరోనా వార్డ్స్ ఏర్పాటు చేసి అక్కడే చికిత్స అందిచాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇక్కడ డాక్టర్లు, నర్సులు, స్యానిటరి సిబ్బంది, పేషంట్ కేర్ వర్కర్స్, మందులు,ఆక్సిజన్ సదుపాయం 24 గంటలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.

Related posts