telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

తరుణ్‌కు పెళ్లి చేసుకోవాలని వాళ్ల అమ్మ కోరారు..

Priyamani

హీరోయిన్ ప్రియమణి దక్షిణాది సినీ ప్రేక్షకులందరికీ సుపరిచితమే. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళీ సినిమాల్లో నటించి మెప్పించిన ఈ బ్యూటీ ‘రావణ్’ సినిమాతో హిందీ చిత్రసీమలోనూ అడుగు పెట్టింది. విభిన్నమైన పాత్రలతో అలరించిన ఆమె పెళ్లి తర్వాత కూడా అదే జోష్ కంటిన్యూ చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో ”విరాటపర్వం, నారప్ప” సినిమాల్లో నటిస్తున్న ప్రియమణి… ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన భర్త ముస్తఫా రాజ్ గురించిన ఆసక్తికర విషయాలు చెప్పింది. అయితే.. తాజాగా తరుణ్‌ ప్రేమ వ్యవహారంపై ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది. నవ వసంతం షూటింగ్‌ సమయంలో తరుణ్‌తో లవ్‌ లో ఉన్నానని… మేమిద్దరం వివాహం చేసుకోనున్నాయని ఎన్నో వార్తలు వచ్చాయంది. అయితే.. ఆ సినిమా షూటింగ్‌ సమయంలో ఓ రోజు తరుణ్‌ వాళ్ల అమ్మ రోజా రమణి గారు మా సెట్‌ కి వచ్చారని.. మీ ఇద్దరూ నిజంగానే ప్రేమలో ఉన్నారా? ఒకవేళ ఉంటే పెళ్లి చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరాల్లేవని తెలిపారని ప్రియమణి చెప్పారు. నచ్చితే… తరుణ్‌ ను పెళ్లి చేసుకో అని వాళ్ల అమ్మ కోరారని ప్రియమణి పేర్కొన్నారు.

Related posts