telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

పుష్పలో మంచు మనోజ్…

Manchu-Manoj

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సినిమా పుష్ప. ఈ సినిమాను టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో లక్కీ బ్యూటీ రష్మిక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఓ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో చేయనున్నారు. కానీ కరోనా లాక్‌డౌన్ కారణంగా సినిమా వాయిదా పడటంతో తిరిగి ప్రారంభం అయ్యే సమయానికి డేట్స్ కుదరక పోవడంతో విజయ్ సేతుపతి పుష్ప సినిమా నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ పాత్రలో మరో యంగ్ హీరో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ పాత్రను మంచు మనోజ్ చేయనున్నారని రూమర్లు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఇదే ప్లాన్‌లో దర్శకుడు సుకుమార్ కూడా ఉన్నారని సినీ సర్కిల్స్‌లో టాక్ నడుస్తోంది. మరి ఈ వార్త ఎంతవరకు నిజమనేది తెలియదు. దీనిపై త్వరలో క్టారిటీ వస్తుందని అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ ఏడాది ఆగస్టు 13 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి బన్నీ, సుకుమార్ కాంబినేషన్ కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. చూడాలి మరి ఈ సినిమా ఆ అంచనాలను అందుకుంటుందా… లేదా అనేది.

Related posts