telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే కి షాక్…

ప్రస్తుతం ఏపీలో పంచాయితీ రాజకీయాలు నడుస్తునా విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికలో మంత్రి కొడాలి నానికి సొంత ఊరిలోనే కి షాక్ ఇచ్చింది టీడీపీ. మంత్రి కొడాలి నాని సొంత ఊరిలో టిడిపి మద్దతు ఇచ్చిన అనూష అనే అభ్యర్థి దాదాపు 800 ఓట్ల మెజారిటీతో సర్పంచ్ గా గెలుపొందింది. పెదపారుపూడి మండలంలో ఉన్న ఎలమర్రు గ్రామంలో 12వ వార్డులకు గాను  11వ వార్డు టిడిపి అభ్యర్థులు కైవసం చేసుకోగా కేవలం ఒకే ఒక్క వార్డుకు వైసిపి పరిమితమైంది. ఒక రకంగా సొంత ఊరిలో ఇది కొడాలి నానికి షాక్ అనే చెప్పాలి.  టిడిపి అంటే మండిపడే కొడాలి నాని సొంత ఊరు మీద ఫోకస్ చేయలేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇక మరో పక్క మంత్రి కొడాలి నాని ఏపీ హైకోర్టుని ఆశ్రయించనున్నారు. ఈ నెల 21న పంచాయితీ ఎన్నికలు ముగిసే వరకు మీడియాతో మాట్లాడవద్దన్న ఎస్ఈసీ ఆదేశాలు సవాలు చేస్తూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు ఆయన. రేపు విచారించే అవకాశం ఉందని చెబుతున్నారు. అంతే కాక మంత్రిపై కేసులు నమోదు చేయాలన్న sec ఆదేశాలపై మరో పిటిషన్ కూడా కొడాలి నాని వేయనున్నారు. చుడాలిమరి ఏం జరుగుతుంది అనేది.

Related posts