కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ మనస్తత్వంపై అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలపై శివసేన పార్టీ సీరియస్ అయింది. భారత దేశం గురించి..ఇక్కడి నాయకుల గురించి ఒబామాకు ఏం అవసరమని, అసలు ఆయనకు ఏం తెలుసునని ఫైర్ అయ్యారు. ఓ విదేశీ రాజకీయ నాయకుడు భారతదేశపు రాజకీయ నాయకుడి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు అని మండిపడ్డారు. మేమెప్పుడూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ను పిచ్చివాడు అనలేదని…ఇండియా సంస్కృతి అలాంటిది కాదని చురకలు అంటించారు శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్.
కాగా.. రాహుల్ గాంధీ గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా తన ఏ ప్రామిస్డ్ ల్యాండ్ పుస్తకంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ నెర్వస్డ్గా ఉంటారని, ఒక కోర్స్ నేర్చుకునే విద్యార్థి ఎలాగైతే ఉపాధ్యాయుడిని ఆకట్టుకోవడానికి ఆతృతగా ఉంటాడో, రాహుల్ గాంధృ కూడా అలానే కనిపిస్తాడని..కానీ ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకునే గుణం, పట్టుదల అతనిలో కనిపించవని ఒబామా తన పుస్తకంలో పేర్కొన్నారు.
previous post
కోట్లాది మంది ఆంధ్రుల్లో తానూ ఒకడిని: కేవీపీ