telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

మేము గంగూలీలా ఆడి విజయం సాధిస్తాం : రాజ్‌నాథ్ సింగ్

Rajnath singh Bjp

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా కేంద్ర మంత్రులు మొత్తం బెంగాల్‌లో చక్కర్లు కొడుతున్నారు. అయితే ఇదే సమయంలో… టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ.. బీజేపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమనే చర్చ కూడా సాగుతోంది. దీనిపై స్పందించిన గంగూలీ.. అన్నీ తన జీవితంలో ఊహించకుండా జరిగాయని వ్యాఖ్యానించారు తప్పితే.. చేరడం లేదు అని స్పష్టంగా చెప్పిందిలేదు. మరోవైపు.. బీజేపీ మాత్రం దాదాను వాడడం మొదలు పెట్టేసింది.. ప‌శ్చిమ‌బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీ ప‌నితీరు సౌర‌వ్ గంగూలీ బ్యాటింగ్‌లా ఉంటుందంటూ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇవాళ కామెంట్ చేశారు.. గంగూలీ క్రీజ్ దాటి ముందుకు వ‌చ్చాడంటే సిక్సర్ కొట్టేవాడ‌ని.. దాదా బ్యాటింగ్‌ స్టైల్‌ను గుర్తు చేసిన ఆయన.. తాము కూడా పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిక్సర్ కొట్టబోతున్నామ‌ని ధీమా వ్యక్తం చేశారు. ఇక, 2019 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం ద్వారా తాము క్రీజ్ దాటి ముందుకు వ‌చ్చామన్న రాజ్‌నాథ్‌.. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సిక్సర్ కొట్టి బెంగాల్‌లో సర్కార్‌ను ఏర్పాటు చేయబోతున్నామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ వ్యాఖ్యల తర్వాత గంగూలీ బీజేపీలో చేరుతాడు అనే మాటలు నిజంలా అనిపిస్తున్నాయి.

Related posts