గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కు ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. ఎన్నికల కోసం అన్ని పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. గ్రేటర్ లో పట్టు నిలుపుకునేందుకు తెరాస పార్టీ సిద్ధం అయ్యింది. ఇందులో భాగంగా నిన్నటి రోజున గ్రేటర్ కు చెందిన ఐదుగురు తెరాస పార్టీ ఎమ్మెల్యేలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. ఈరోజు మరో ఐదుగురు ఎమ్మెల్యేలతో భేటీ కాబోతున్నారు. రేపు కూడా ఈ భేటీ ఉండబోతున్నది. డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికలకు వెళ్తే ఎలా ఉంటుంది అనే అంశంపై కేటీఆర్ ఎమ్మెల్యేల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నారు. గ్రేటర్ లోని డివిజన్ల వారీగా పరిస్థితిని తెలుసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని కేటీఆర్ ఇప్పటికే ఎమ్మెల్యేలకు సూచించారు. అయితే దుబ్బాకలో జరిగిన విధంగా ఇక్కడ కూడా జరగకూడదని తెరాస అనుకుంటుంది. అందుకు తగినట్లుగానే వ్యూహాలు రచిస్తోంది. అయితే దుబ్బాక ఉప ఎన్నికలో బీజేపీ చేతిలో తెరాస ఓటమిపాలైన విషయం అందరికి తెలిసిందే. మరి అదే ఫలితం ఇక్కడ కూడా రిపీట్ అయితే తెరాస పరిస్థితి ఏంటి అనేది చూడాలి.