telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వైసీఎల్పీ నేతగా వైఎస్‌ జగన్ ఏకగ్రీవ ఎన్నిక

everything is ready for 30th jagan oath

వైఎస్సార్‌ శాసనసభాపక్ష నేతగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికయ్యారు. తాడేపల్లిలోని జగన్‌ క్యాంపు కార్యాలయంలో సమావేశమైన ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ సీనియర్‌ నాయకుడు బొత్స సత్యనారాయణ ప్రతిపాదించగా.. దానిని పార్టీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, ఆదిమూలపు సురేష్‌ బలపరిచారు.

సాయంత్రం జగన్‌, వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ నరసింహన్‌ను కలవనున్నారు. శాసనసభాపక్ష తీర్మానాన్ని గవర్నర్‌కు అందజేసి, ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటుకు తమను ఆహ్వానించాల్సిందిగా ఆయనకు విజ్ఞప్తి చేస్తారు. అనంతరం విజయవాడలో 30వ తేదీన జగన్‌ ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లను చేయనున్నారు.

Related posts