రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో పగటిపూట ప్రయాణం చేయడం ఓ సాహసమని చెప్పొచ్చు. ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతూ రైలు ప్రయాణించడం కష్టమే. అందుకే పగటిపూట రైల్ ప్రయాణం చేసేవారు ఏసీ బోగీలను బుక్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో విశాఖ నుంచి ఢిల్లీ బయలుదేరిన ఏపీ ఎక్స్‌ప్రెస్ లో ఏసీలు పని చేయటం లేదంటూ ప్రయాణికులు ఆందోళన చేశారు. దీంతో రాజమండ్రి రైల్వేస్టేషన్‌లో గంటన్నర పాటు రైలు నిలిచిపోయింది.
తాడేపల్లిగూడెంలో ఏసీ రిపేర్ చేయిస్తామని రైల్వే అధికారులు చెప్పటంతో ప్రయాణికులు శాంతించారు. సాంకేతిక లోపం వల్ల ఏసీ నిలిచిపోయిందని తెలిపారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విశాఖపట్నం నుంచి గురువారం ఉదయం 8.30 గంటలకు ఏపీ ఎక్స్‌ప్రెస్ బయలు దేరింది. మద్యాహ్నం 12.30 గంటలకు రాజమండ్రి రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. మరమ్మతులు అనంతరం రైలు బయలుదేరింది. అయితే ఏ3 బోగిలో మాత్రం ఏసీ పని చేయటం లేదని అధికారులు నిర్దారించారు.