టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు కు చిక్కులు ఎక్కువ అవుతున్నాయి తప్ప, తగ్గడంలేదు. తాజాగా, ఆయన తనయుడు డాక్టర్ శివరామకృష్ణపై మరో కేసు నమోదైంది. నరసరావుపేటకు చెందిన ఎమ్మార్పీఎస్ నాయకుడు కాల్వ రవి ఫిర్యాదు మేరకు శివరామకృష్ణతోపాటు ఆయన కార్యదర్శి ప్రసాదుపై మోసం, కుల దూషణ, బెదిరింపు నేరాల కింద కేసులు నమోదు చేసినట్టు రెండో పట్టణ పోలీసులు తెలిపారు.
పట్టణానికి చెందిన మద్దూరి నాగరాజు అనే వ్యక్తికి జిల్లా పరిషత్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని శివరామకృష్ణ ఐదు లక్షలు, ఆయన కార్యదర్శి ప్రసాదు రెండు లక్షల రూపాయలు తీసుకున్నట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో రవి పేర్కొన్నారు. ఉద్యోగం ఇప్పించడంలో విఫలమైనందున డబ్బులు వెనక్కి ఇవ్వమన్నా ఇవ్వలేదని ఆరోపించారు. కులం పేరుతో దూషించారని, బెదిరించారని ఆరోపించారు. రవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆ రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ ఎందుకు ప్రచారం చేయడం లేదు: కేజ్రీవాల్