telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

కేసీఆర్ జగన్ పదవీ ప్రమాణ స్వీకార సభలో పాల్గొంటారా ?

Will KCR participate in the swearing-in ceremony
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సభలో తెలంగా ముఖ్యమంత్రి కె . చంద్ర శేఖర్ రావు పాల్గొంటారా ? తెలంగాణ రాష్ట్రంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెరాస కు ఊహించని దెబ్బ తగిలింది . కారు , సారూ , పదహారు అనే నినాదంతో ఎన్నికల్లో దిగిన కేసీఆర్ కు తెలంగా ప్రజలు ఊహించని రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు . ఏడు పార్లమెంట్ స్థానాల్లో తెరాస ఓడిపోయింది . అన్నినింటి కన్నా నిజామాబాద్ లో కేసీఆర్ కు తన కూతురు కవిత ఘోరంగా ఓడిపోవడం , భారతీయ జనతా పార్టీ అభ్యర్థి  ధర్మపురి అరవిందు గెలవడం జీర్ణించుకోలేని వాస్తవం . 
అందుకే గత రెండురోజుల నుంచి కేసీఆర్ మాటా మంథి లేకుండా వున్నాడు . ఈ పరిస్థితుల్లో జగన్ కేసీఆర్ ను కలుస్తున్నాడు . వై .ఎస్ .ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఈరోజు అమరావతిలో శాసన సభా పక్ష నేతగా ఎన్నికవుతారు. తరువాత తన ఎన్నికను గవర్నర్ కు తెలియజేయడానికి హైదరాబాద్ రాజ్ భవన్ వస్తారు . గవర్నర్ ను కలిసిన తరువాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావును ఆయన నివాసం ప్రగతి భవన్ లో కలిసి 
30వ తేదీన ఉదయం 12. 00 గంటలకు జరిగే తన  పదవీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తారు . 
జగన్ ముఖ్యమంత్రి కావాలని ఆశించిన వారిలో చంద్ర శేఖర్ రావు ప్రధమ స్థానంలో వున్నారు . అంతేకాదు తన ప్రత్యర్థి నారా చంద్ర బాబు ఓడిపోడానికి జగన్ కు చంద్ర శేఖర్ రావు ఆర్ధికంగా కూడా సహకరించారని లోగుట్టు సమాచారం . అందు చేత చంద్ర బాబుకు రిటర్న్ గిఫ్ట్ జగన్ ద్వారా ఇప్పించానని చంద్ర శేఖర్ రావు నమ్ముతున్నాడు . కాబట్టి ఈ పదవీ ప్రమాణ స్వీకారానికి చంద్ర శేఖర్ రావు తప్పకుండా హాజరయ్యే అవకాశం వుంది . తెలుగు ప్రజలంటే తనకు ఎంతో అభిమానం ఉందని , రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని తానూ ఆకాంక్షిస్తున్నట్టు కేసీఆర్ సందేశం ఇచ్చే అవకాశం వుంది . జగన్ తో కలసి పనిచేస్తానని కూడా చెప్పవచ్చు .
దీనివల్ల తెలంగాణ లో ముఖ్యంగా హైద్రాబాద్లో వున్నా ఆంధ్ర ప్రాంత ప్రజలకు మరింత దగ్గర కావచ్చునని కేసీఆర్  భావిస్తున్నాడు . మొన్న లోక్ సభ ఎన్నికల్లో జరిగిన నష్టాన్ని కొంతయినా పూడ్చుకోవచ్చనేది ఆయన ఆలోచన చంద్ర శేఖర్ రావు జగన్ ముఖ్యమంత్రి పదవీ ప్రమాణ స్వీకార సభలో పాల్గొండమేకాక ప్రసంగించే అవకాశం వుంది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు ఆర్ధిక సహాయం కూడా ప్రకటించే అవకాశం  ఉందని చెప్పవచ్చు . 
-భగీరథ 

Related posts