telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రులు చెప్పాలి: దేవినేని

uma devineni

ఏపీలో రెండు టీవీ ఛానళ్ల ప్రభుత్వం ప్రసారాలను నిలిపివేసింది. ఈ నేపథ్యంలో టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఘాటుగా స్పందించారు. వాస్తవాలను ప్రసారం చేస్తున్న ఛానళ్లను నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఏబీఎన్, టీవీ5 ఛానళ్లను ఎందుకు ఆపారో మంత్రుల చెప్పాలని డిమాండ్ చేశారు. ఎంఎస్వోలపై ఒత్తిడి చేసి ఛానళ్ల ప్రసారాలను ఆపేస్తారా? అని అడిగారు. ఈ ఛానళ్ల ప్రసారాలను ఎప్పుడు పునరుద్ధరిస్తారో చెప్పలని డిమాండ్ చేశారు.

ప్రసారాలను పునరుద్ధరించేంత వరకు ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తామని చెప్పారు. మీడియా స్వేచ్ఛను హరించడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. జగన్ పాలనను జాతీయ మీడియా ఎండగట్టిందని చెప్పారు.వంద రోజుల పాలనలో ఏం చేశారో కూడా చెప్పుకోలేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నారనిఎద్దేవా చేశారు. గత మూడు నెలలుగా రాష్ట్రంలో రివర్స్ పాలన నడుస్తోందని విమర్శించారు. వేల కోట్ల ఉపాధి హామీ నిధులు వస్తే ట్రెజరీలో పెట్టుకున్నారని ఆరోపించారు.

Related posts