telugu navyamedia
సినిమా వార్తలు

“ఎన్.జి.కే” ఫ్లాప్ పై సూర్య కామెంట్స్

surya ngk movie teaser

తెలుగు, తమిళ భాషల్లో సూర్యకు భారీ క్రేజ్ ఉంది. ఇటీవల సూర్య నటించిన “ఎన్జీకే” చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని సీనియర్ దర్శకుడు సెల్వరాఘవన్ రూపొందించారు. సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా, రకుల్ ప్రీత్ సింగ్ కీలక పాత్రలో నటించింది. మే 31న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. పొలిటికల్ డ్రామా ప్రేక్షకులను ఎంతమాత్రం ఆకట్టుకోలేకపోయింది. తాజాగా హీరో సూర్య ట్విట్టర్ వేదికగా ఎన్జీకే ఫ్లాప్ పై హుందాగా స్పందించాడు. “ఎన్జీకే చిత్రంపై మీ అభిప్రాయాలని, ప్రేమని, ఆలోచనలని గౌరవంగా స్వీకరిస్తున్నా. అలాగే చిత్రంలో నటీనటుల పెర్ఫామెన్స్ ని మెచ్చుకున్న వారందరికీ ధన్యవాదాలు. ఈ చిత్రం కోసం పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు కృతజ్ఞతలు” అని సూర్య ట్వీట్ చేశాడు. త్వరలో సూర్య కెవి ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ “కాప్పాన్” చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts