telugu navyamedia
విద్యా వార్తలు

తెలంగాణలో తగ్గనున్న ఇంజనీరింగ్‌ సీట్లు

Applications invited for Scholarships

తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఇంజనీరింగ్‌ సీట్లు మరింతగా తగ్గిపోనున్నాయి. గతేడాది అనుబంధ గుర్తింపు ఇచ్చిన సీట్ల కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది. గతేడాది రాష్ట్రంలోని 228 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,14,247 సీట్ల భర్తీకి ఏఐసీటీఈ గుర్తింపు ఇచ్చింది. అయితే రాష్ట్రంలోని యూనివర్సిటీలు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోని ఫ్యాకల్టీ, వసతులను బట్టి 198 కాలేజీల్లో 95,235 సీట్లకే అనుబంధ గుర్తింపును ఇచ్చాయి. 

ఇక ఈ విద్యా సంవత్సరంలో ఏఐసీటీఈ రాష్ట్రంలో 214 ఇంజనీరింగ్‌ కాలేజీల్లో 1,08,175 సీట్లకు గుర్తింపు ఇవ్వగా.. యూనివర్సిటీలు దాదాపు 180 కాలేజీల్లో 90 వేల లోపు సీట్లలో భర్తీకే అనుబంధ గుర్తింపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొన్ని కాలేజీల్లో ప్రవేశాలు లేక కొన్ని కోర్సులను రద్దు చేసుకోగా, కొన్ని కాలేజీలు పూర్తిగా మూసివేతకు దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు కొన్ని కాలేజీల్లో లోపాల కారణంగా యూనివర్సిటీలు సీట్లను తగ్గిస్తున్నట్లు తెలిసింది. దీంతో గతేడాది కంటే ఈసారి 5 వేలకు పైగా సీట్లు తగ్గిపోయే పరిస్థితి నెలకొంది.

Related posts