ఏపీ సీఎం జగన్ కేబినెట్ లో స్థానం దక్కిన మంత్రులకు ఈ రోజు ఫోన్లు చేయనున్నారు. మంత్రులుగా మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో 20 మంది మంత్రులు ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారు. శుక్రవారం జరిగిన వైసీపీఎల్పీ సమావేశంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ కీలక ప్రకటన చేశారు. ఇవాళ సాయంత్రం కాబోయే మంత్రులకు వైసీపీ కీలకనేత, వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్లు చేయనున్నారు.
కొత్త మంత్రులకు విజయసాయిరెడ్డి ఫోన్లు చేస్తారని సీఎల్పీ భేటీలో సీఎం జగన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. కేబినెట్‌లో సగం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఉంటారని జగన్ ప్రకటించడంతో వాళ్లెవరనేదాని పై సర్వ్రతా ఉత్కంఠ నెలకొంది. మరోవైపు రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ మార్పులు చేర్పులు జరుగుతాయని చెప్పడంతో ముఖ్యనేతలందరికీ మంత్రివర్గంలో స్థానం దక్కే అవకాశముంది.