telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

మిస్ యూ నాన్నా… ప్రియాంక చోప్రా భావోద్వేగ పోస్ట్

Priyanka-Chopra

గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గతేడాది హాలీవుడ్ అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం వీరిద్దరూ అమెరికాలో కాపురం పెట్టారు. నిక్ కంటే ప్రియాంక పదేళ్లు పెద్దది కావడంతో సోషల్ మీడియాలో ఇప్పటికీ విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ఎదిగి గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు సంపాదించుకుంది ప్రియాంకా చోప్రా. ఆమె విజయంలో ఆమె తండ్రి ఆకాశ్ చోప్రా పాత్ర అతి కీలకమైనది. అందుకే తండ్రి ఎప్పుడూ గుర్తుండేలా “డాడీస్ లిటిల్ గర్ల్” అని తన చేతిపై ప్రియాంక టాటూ వేయించుకుంది. తన తండ్రి జయంతి సందర్భంగా ప్రియాంక సోషల్ మీడియాలో ఓ భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన తండ్రి ఫోటోను పోస్ట్ చేసి బ్యాగ్రౌండ్‌లో ఆయనకిష్టమైన పాటను జత చేసింది. “మిమ్మల్ని సర్‌ప్రైజ్ చేయాలని మీ ప్రతీ పుట్టినరోజునాడు నేను, సిద్ధార్థ్ కలిసి ప్లాన్ చేసేవాళ్లం. కానీ, మా ప్లాన్‌లన్నీ మీకు ముందుగానే తెలిసిపోయేవి. నేను చేసే ప్రతీ పనిలోనూ మీ అంగీకారం, ప్రోత్సాహం తప్పనిసరి. ఇప్పటికీ మీ ఆశీర్వాదాలతోనే నాకు అన్నీ జరుగుతున్నాయి. హ్యాపీ బర్త్‌డే నాన్నా. మీరు ప్రతీరోజూ నాతోనే ఉంటే బాగుండుననిపిస్తోంది. మిస్ యూ” అని ప్రియాంక పేర్కొంది.

Related posts