పోలీసుల సహకారంతో కబ్జా కాండ జరిపిన మైహోమ్ రామేశ్వరరావు “టీవీ9” వ్యవస్థాపకుడు రవిప్రకాష్ కు ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా చేసిన పనికి గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టైంది.. రకరకాల దొంగ కేసులు నకిలీ సాక్ష్యాలు బనాయించి టీవీ9 లోకి ప్రవేశించిన రామేశ్వర రావు మెగా కృష్ణారెడ్డి ద్వయం, అన్నీ కబ్జా చేశారు కానీ టీవీ9 లోగో రవి ప్రకాష్ పేరుమీద ఉండడంతో ఖంగుతిన్నారు. టీవీ9 పేరు మార్చక తప్పని పరిస్థితి ఎదురైంది.
లోగో విషయంలో రవి ప్రకాష్ పైన పెట్టిన కేసు పై హైకోర్టు మండిపడింది.సెక్షన్ 180 ప్రకారము రవి ప్రకాష్ షేర్ హోల్డర్ మాట వినాలని రామేశ్వర రావు వాదించారు. సెక్షన్ 180 పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల కోసమని , టీవీ9 ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అని హైకోర్టు చెప్పడంతో మైహోమ్ రామేశ్వరరావు కు చెంపపెట్టు గా మారింది ! టీవీ9 లోగో పై రవి ప్రకాష్ కు పూర్తి అధికారాలు ఉండటం చూసి జుట్టు పీక్కున్న మైహోమ్ రామేశ్వరరావు, మెగా కృష్ణారెడ్డి లు “టీవీ9” పేరు మార్చి “ఏబిసిఎల్” టివి అని పేరు పెట్టాలని చూస్తున్నారు.
తొలి రోజు నుంచే జగన్ అరాచకాలను ప్రారంభించారు: చంద్రబాబు