telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బెల్లీ డ్యాన్స్ తో అదరగొడుతున్న జాన్వీ సోదరి… వీడియో వైరల్

Shanaya-Kapoor

బాలీవుడ్ లో ఇప్పటికే కపూర్ ఫ్యామిలీ నుంచి చాలామంది నటీనటులుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. అందులో కరీనా కపూర్, కరిష్మా కపూర్, జాహ్నవి కపూర్, అర్జున్ కపూర్, సోనమ్ కపూర్ లు స్టార్ హీరోయిన్లుగా వరుస సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇక తాజాగా బాలీవుడ్ నటుడు సంజయ్ కపూర్ కూతురు శనయకపూర్ బెల్లీ డ్యాన్స్ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. శనయ ట్రైనర్ సంజన ముత్రేజాతో కలిసి సోలో డ్రమ్ స్టెప్పులకు బెల్లీ డ్యాన్స్ చేసిన వీడియోను..సంజన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. కపూర్ ఫ్యామిలీ నుంచి రాబోయే సెన్సేషన్ శనయ అంటూ..బెల్లీ డ్యాన్స్ వీడియోపై ఫాలోవర్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. జాన్వీకపూర్, సారా అలీఖాన్ ను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్… శనయ కపూర్ ను కూడా గ్రాండ్ గా లాంఛ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

Related posts