మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ భార్యగానే కాకుండా తనకంటూ సొంత గుర్తింపు సంపాదించుకున్నారు ఉపాసన. బిజినెస్ ఉమెన్‌గా, అపోలో గ్రూపుకు చెందిన “బి పాజిటివ్” మేగజైన్ ఎడిటర్‌గా ఉపాసన పలు పాత్రలు పోషిస్తున్నారు. “బి పాజిటివ్” మేగజైన్ కోసం పలువురు సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేసి వారి ఆరోగ్య రహస్యాలను, డైట్ ప్లాన్స్‌ను పాఠకులకు అందిస్తుంటారు.
ఇందులో భాగంగా ఉపాసన తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఈ నేపథ్యంలోనే “భారత్” సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నప్పటికీ ఉపాసనకు సల్మాన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. సల్మాన్‌ను ఇంటర్వ్యూ చేసిన విషయాన్ని ఉపాసన ట్విటర్ ద్వారా తెలియజేశారు. “ఇదీ భాయ్ అంటే. సల్మాన్ ఖాన్‌లోని కొత్త కోణాన్ని త్వరలో చూపించబోతున్నాం. మీ రహస్యాలను మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు సల్మాన్” అంటూ ఉపాసన ట్వీట్ చేశారు. మెగా ఫ్యామిలీతో సల్మాన్‌ఖాన్‌కు మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. రామ్‌చరణ్‌కు సల్మాన్ మంచి స్నేహితుడు.