telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నెలల పాపతో సమీరారెడ్డి సాహసం… వీడియో వైరల్

Sameera-Reddy

బాలీవుడ్ నటి సమీరారెడ్డి జులైలో పండంటి బిడ్డకు పాపాయికి జన్మనిచ్చింది. అంతేకాదు ఆ పాపకు నైరా అనే పేరు పెట్టినట్లు కూడా తెలిపింది. అయితే ఇప్పుడు సమీరా చేసిన సాహసం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సమీరా రెడ్డి తన రెండు నెలల కూతురిని ఎత్తుకొని పెద్ద సాహసమే చేసింది. కర్ణాటకలో అతి ఎత్తైనది ముల్లయనగిరి పర్వతం. సమీరా ఈ పర్వత శిఖరాన్ని అధిరోహించే ప్రయత్నం చేసి ఎంతోమంది తల్లుల్లో మనోధైర్యం నింపేందుకు ప్రయత్నించింది. పర్వతంపైకి వెళ్తుండగా మార్గమధ్యలో ఓ వీడియో తీసి ఇన్స్టా గ్రామ్ లో షేర్ చేసింది సమీరా. ఇది 6300 అడుగుల ఎత్తైన పర్వతం. నా కూతురు నైరాతో కలిసి ఎక్కే ప్రయత్నం చేశా. కొన్ని మెట్లు ఎక్కి కొంతదూరం రాగలిగాను ప్రెగ్నెన్సీ, డెలివరీ తర్వాత ఏ మాత్రం భయపడకుండా తల్లులు మరింత ఎనర్జీతో ముందుకు సాగాలంటూ ఓ సందేశాన్ని పంపింది సమీరా. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Related posts