telugu navyamedia
రాజకీయ

భవానీపుర్​ ఉపఎన్నికలో మార్పు లేదు..

ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేయనున్న భవానీపుర్​ ఉపఎన్నికలోఎలాంటి మార్పు లేద‌ని, షెడ్యూల్​ ప్రకారమే జరగాలని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది.  ఉప ఎన్నిక వాయిదా వేయాలని దాఖలు చేసిన పిటిషన్​ను తాత్కాలిక సీజే జస్టిస్​ రాజేష్​ బిందాల్​, జస్టిస్​ ఆర్​. భరద్వాజ్​ సభ్యులుగా గల ధర్మాసనం విచారణ చేసింది. 

Bengal cabinet nod for two policies to boost jobs - Telegraph India

అయితే ఎన్నిక జరగాలని బంగాల్​ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి(సీఎస్​).. ఈసీకి లేఖ రాయడం కూడా సరైనది కాదని తేల్చిచెప్పింది. భవానీపుర్​లో పోలింగ్​ జరగకుంటే.. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందని, ఆ లేఖలో పేర్కొన్నారు సీఎస్​. 

అయితే ఉప ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేయ‌బోమ‌ని, గురువార‌మే( సెప్టెంబర్​ 30న) ఆ ఎన్నిక‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు కోర్టు చెప్పింది. దీంతో బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, భాజపా అభ్యర్థి ప్రియాంక తిబ్రేవాల్​ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

West Benbal By Election BJP Change BJP changed campaign strategy in Bhawanipur seat for Mamata Banerjee

కాగా..భవానీపుర్ నుంచి 2011, 2016లో దీదీ ప్రాతినిధ్యం వ‌హించారు. బీజేపీ అభ్య‌ర్థి ప్రియాంకా తిబ్రేవాల్‌తో మ‌మ‌తా పోటీప‌డుతున్నారు. 41 ఏళ్ల తిబ్రేవాల్ కోల్‌క‌తా హైకోర్టులో లాయ‌ర్‌గా చేస్తున్నారు. మూడ‌వ‌సారి సీఎం అయిన మ‌మ‌తా బెన‌ర్జీ.. నందీగ్రామ్‌లో ఓడిపోవ‌డం వ‌ల్ల‌.. భవానీపుర్ ఉప ఎన్నిక‌లో క‌చ్చితంగా ఎమ్మెల్యేగా గెల‌వాల్సి ఉంటుంది.

Related posts