రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రం ఎంత చెప్పినా… రైతులు మాత్రం చట్టాల రద్దుకే డిమాండ్ చేస్తున్నారు. అయితే.. రైతుల డిమాండ్‌లపై కేంద్ర మంత్రులు చర్చలు జరుపుతూనే ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రేపు నిరాహారదీక్షకు రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చాయి. ఈ నేపథంలో ఢిల్లీ సరిహద్దుల్లో అదనపు బలాగాలు మోహరించాయి. ఈ నెల 19 లోపు చట్టాలను వెనక్కి తీసుకోవాలని రైతులు అల్టిమేటం ప్రకటించారు. కేంద్రం దిగిరాకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని రైతులు హెచ్చరికలు జారీ చేశారు. రైతుల డిమాండ్ల నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ భేటీ అయ్యారు. ఇక రేపు జరిగే… రైతుల నిరాహార దీక్షకు విపక్షాలు సైతం మద్దతు పలికాయి. అయితే.. రైతులకు మద్దతుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఒక రోజు ఉపవాస దీక్ష చేయనున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష చేయనున్నట్టు ఆయన ప్రకటించారు. రైతులకు మద్దతుగా ఒక రోజు ఉపవాసం చేపట్టాలని కేజ్రీవాల్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దేశం మొత్తం రైతులకు అండగా నిలవాలని ఆయన పేర్కొన్నారు. కొందరు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు రైతులు దేశ వ్యతిరేకులని అనడం దారుణమని ఫైర్ అయ్యారు.
previous post
టీడీపీ ఓడిపోవడానికి పవనే కారణం: సుమన్