telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా వాక్సినేషన్ పై కేంద్రం శుభవార్త

మార్చి 1 నుంచి 60 ఏళ్ళు పైబడిన వారికి “కోవిడ్” వాక్సినేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ పేర్కొన్నారు. ప్రభుత్వాసుపత్రిలో వాక్సినేషన్ పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ వేయించుకునే వారు ధర చెల్లించాల్సి ఉంటుందని… మార్చి 1 నుంచి 60 ఏళ్లు పైబడిన వారికి, లేదా 45 ఏళ్ళు దాటి, తీవ్ర అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారికి కూడా 10,000 ప్రభుత్వ కేంద్రాలు మరియు 20,000 ప్రైవేట్ ఆసుపత్రులలో “కరోనా” టీకాలు ఇస్తారని తెలిపారు. దేశంలో ఐటి హార్డ్‌వేర్ ఉత్పత్తుల తయారీ కోసం ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని కేంద్ర క్యాబినెట్ ఆమోదించిందని… దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, ఐటి హార్డ్‌వేర్ వల్ల పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి ఈ పథకం ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. ఈ పథకంలో భాగంగా టార్గెట్ విభాగాలలో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, ఆల్ ఇన్ వన్ పిసిలు మరియు సర్వర్‌లు తయారీ చేయబడతాయని తెలిపారు. ఈ ప్రతిపాదిత పథకం మొత్తం వ్యయం 4 సంవత్సరాలలో సుమారు రూ. 7,350 కోట్లు, ఇందులో రూ. 7,325 కోట్ల ప్రోత్సాహక వ్యయం మరియు రూ .25 కోట్లు పరిపాలనా ఛార్జీలు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ పథకం 4 సంవత్సరాలలో 1,80,000 (ప్రత్యక్ష మరియు పరోక్ష) ఉపాధి అవకాశాలు కల్పించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

Related posts