telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ డ్రెస్సులు వేస్తే తప్పేంటి అంటున్న బాలీవుడ్‌ బ్యూటీ !

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ “కేదారనాథ్” చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైంది. ఈ సినిమాలో సుశాంత్ రాజ్ పుత్ కథానాయకుడు. ఈ సినిమాలోని బోల్డ్ సీన్స్ లో కూడా వీరు బాగా నటించడంతో తెరపై వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. అయితే ఇప్పుడు వీరిద్దరూ ప్రేమలో పడ్డారంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.  సైఫ్ కూతురు సారా ఇప్పటి వరకూ చేసింది కొన్ని సినిమాలే అయినా నటనతో ఫర్లేదనిపించింది. ఇక స్టైల్ విషయంలో అయితే తనదైన సపరేట్ రూటు ఆమెది. జాన్వీ కపూర్, అనన్య పాండే లాంటి న్యూ ఏజ్ బీ-టౌన్ బ్యూటీస్ ఖరీదైన బ్రాండెడ్ బట్టలతో ఆకట్టుకుంటూ ఉంటారు. సారా మాత్రం ఒక్కోసారి ఒక్కో విధంగా దర్శనం ఇస్తుంది. ఓ సారి పోష్ గా మెస్మరైజ్ చేస్తే మరో సారి సింపుల్ కాటన్ క్లోత్స్ తోనూ కెమెరాల ముందుకు వచ్చేస్తుంది. నవాబ్ ఖాన్ దాన్ నుంచీ వచ్చిన రాయల్ బ్యూటీ అయినప్పటికీ గ్రాండ్ గా కనిపించాలని మరీ ఎక్కువగా తాపత్రయపడదు. లుక్స్ విషయంలోనే కాదు సారా అలీఖాన్ మాటల్లోనూ ఎంతో మెచ్యూరిటీ కనిపిస్తుంది. ఇంటర్వ్యూల్లో ఎటువంటి యాటిట్యూడ్ చూపించకుండా సమాధానాలు ఇస్తుంది. రీసెంట్ గా ఆమె సమ్మర్ స్పెషల్ డ్రెస్సింగ్ పై కొందరు అమ్మాయిలకి యూజ్ ఫుల్ సజెషన్స్ చేసింది. వాటి సారాంశం ఏంటంటే, ఖరీదు ఎక్కువ పెట్టి కొనటం కాకుండా మనకు కంఫర్టబుల్ గా ఉండేవే వేసవిలో ధరించాలట. అయిదు వందలు, వెయ్యి రూపాయలు పెట్టి కూడా తాను బట్టలు కొనేస్తుంటానని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 

Related posts