telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కింగ్ నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ

Nagarjuna

టాలీవుడ్ కింగ్, మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం బాలీవుడ్‌లో రణ్‌బీర్ కపూర్ హీరోగా వస్తున్న ‘బ్రహ్మాస్త్ర’ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో పాటు ధ‌నుష్ దర్శకత్వంలో ‘నాన్ రుద్రన్’, సాల్మొన్ దర్శకత్వంలో “వైల్డ్ డాగ్” చిత్రాలలో నటిస్తున్నారు. సెప్టెంబర్ 6న “బిగ్ బాస్-4″తో బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నాగార్జున. అరవై సంవత్సరాలు వచ్చినా అమ్మాయిల మనసులో ఇంకా మన్మధుడు గానే ఉన్న కింగ్ నాగార్జున 61వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా నాగార్జునకు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related posts