telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

పఠాన్ రిటైర్మెంట్ కి.. అదే కారణం.. : గ్రెగ్‌ చాపెల్‌

chappel on patan retirement

ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన భారత బౌలర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ పై మాజీ కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆస్ట్రేలియాలోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న చాపెల్‌ అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పఠాన్‌ రిటైర్మెంట్‌పై స్పందించాడు. జట్టుకు అవసరమైన సమయంలో ఏ పాత్ర పోషించడానికైనా ఈ లెఫ్టార్మ్‌ బౌలర్‌ సిద్దంగా ఉండేవాడని కితాబిచ్చాడు. అంతేకాకుండా పఠాన్‌ అత్యంత ధైర్యవంతుడని అదేవిధంగా నిస్వార్థపరుడని ప్రశంసించాడు.

ఇర్ఫాన్‌ పఠాన్‌ టెస్టుల్లో సెంచరీ సాధించాడు. అదేవిధంగా వన్డేల్లో శతకానికి దగ్గరగా వచ్చి మంచి ఆల్‌రౌండర్‌ అని నిరూపించుకున్నాడు. బౌలింగ్‌లో వన్డేల్లో విశేషంగా రాణించాడు. టెస్టుల్లో కూడా ఆకట్టుకున్నాడు. బంతిని రెండు వైపులా స్వింగ్‌ చేస్తూ వికెట్లు పడగొట్టే విధానం నాకు బాగా నచ్చేది. కరాచీలో పాకిస్తాన్‌తో జరిగిన టెస్టులో తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ సాధించడం ఇర్ఫాన్‌ పఠాన్‌ ఇన్నింగ్స్‌లలో నాకు బాగా నచ్చిందని చాపెల్‌ పేర్కొన్నాడు.

Related posts