telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

స్వర్ణ ప్యాలెస్ కేసుపై ఏపీ హైకోర్టు స్టే

ap high court

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ కొవిడ్ కేర్ సెంటర్లో జరిగిన అగ్నిప్రమాదంలో 10 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై  నమోదైన ఎఫ్ఐఆర్ పై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ కేసులో రమేశ్ ఆసుపత్రి యాజమాన్యంపై తదుపరి చర్యలు నిలిపివేయాలని ఆదేశించింది. తమపై నమోదైన కేసు కొట్టివేయాలంటూ రమేశ్ ఆసుపత్రి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

రమేశ్ ఆసుపత్రి తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. అనేక ఏళ్లుగా స్వర్ణ ప్యాలెస్ లో కార్యకలాపాలు జరుగుతున్నాయని, ఆ హోటల్లో కొవిడ్ కేర్ సెంటర్ నిర్వహణకు అధికారులు అనుమతులు ఇచ్చారని వెల్లడించారు.

దీనిపై స్పందించిన హైకోర్టు… అనుమతులు ఇచ్చిన అధికారులు కూడా బాధ్యులే కదా అని పేర్కొంది.స్వర్ణ ప్యాలెస్ హోటల్ ను కొవిడ్ కేర్ సెంటర్ గా అనుమతించిన జిల్లా కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎం అండ్ హెచ్ఓలను ఎందుకు బాధ్యులుగా చేయలేదని ప్రశ్నించింది. 

Related posts