షేక్ పెట్ తహసీల్దార్ బదిలీ వ్యవహారంలో నా ప్రమేయం ఏమి లేదని, దీనిపై నేను ఎవరితో మాట్లాడలేదని అన్నారు. తహసీల్దార్ కూడా తనపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు అని మీడియాలో చెప్పారని, బదిలీ అనేది రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం దాంట్లో నాకు ఎలాంటి పాత్ర లేదని అన్నారు. అయితే మేయర్ పదవి రాగానే గద్వాల్ విజయలక్ష్మి ప్రతీకారం తీర్చుకున్నారని, తనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఎమ్మార్వోని విజయలక్ష్మి బదిలీ చేయించారని జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ అంశం మీద ఆమె స్పందించారు. అలానే ఈ మధ్య నేను ఓ టీవీ ఛానెల్ కు ఇచ్సిన ఇంటర్వ్యూలో ఒక మాటను వక్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని చెబుతూ దానికి కూడా క్లారిటీ ఇస్తున్నానని అన్నారు. నగరంలో వందేళ్ళలో రానంత ఎక్కువగా ఈ సారి వర్షాలు పడ్డాయి. దాంతో నగరంలో వరదలు వచ్చాయని అన్నారు. అంతటి భారీ వర్షాలు. వరదలు రాకుండా చూడాలని దేవుడిని కోరుకుంటా అనేది నా ఉద్దేశ్యం అని అయితే దాన్ని కొంత మంది సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని ఆమె అన్నారు. హైదరాబాద్ నగరంలో వరదలు రావొద్దు అని నా ఉద్దేశ్యం తప్ప వర్షాలు రావొద్దు అని కాదని ఆమె అన్నారు. కానీ ఉద్యోగులు మాత్రం ఆవిడని తప్పు బడుతున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.