telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

భారత్ కరోనా : ఈరోజు ఎన్ని కేసులంటే…?

ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. తాజా కేసులతో దేశంలో 2.86 కోట్లు దాటాయి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య. గడచిన 24 గంటలలో 1,14,460 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్ప‌టివ‌ర‌కు ఇండియాలో న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,88,09,339 కి చేరింది. ఇందులో 2,69,84,781 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14,77,799 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 2677 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,46,759 కి చేరింది. ఇక ఇదిలా ఉంటే, గ‌డిచిన 24 గంటల్లో క‌రోనా నుంచి 1,89,232 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక‌పోతే, దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు మొత్తం 23,13,22,417 మందికి వ్యాక్సిన్ అందించారు.

Related posts