telugu navyamedia
సినిమా వార్తలు

వి ఆర్‌ ఇండియన్స్‌ ..‘వాట్ లగా దేంగే’ లైగర్ నుంచి మరో క్రేజీ సాంగ్ రిలీజ్..

రౌడీ బాయ్ విజయ్‌ దేవరకొండ హీరోగా డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘లైగర్.ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. .

ఇప్పటికే విడుదలైన లైగర్ పోస్టర్లు, గ్లిమ్ప్స్ , టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. అలాగే లైగర్ నుంచి వచ్చిన ”అక్కడి పక్కడి” అనే సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేసిన విషయం తెలిసిందే.. యూట్యూబ్ లో ఈ పాట ట్రెండింగ్ లో దూసుకుపోతోంది.

Liger song Waat Laga Denge: Vijay Deverakonda's here to give you an energy boost - Hindustan Times

తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్‌ సాంగ్‌ విడుదలైంది.‘వాట్ లగా దేంగే’ అంటూ సాగే ఈ పాట.. విజయ్‌ మాస్‌ డైలాగ్స్‌తో ఆకట్టుకుంటోంది. “వి ఆర్‌ ఇండియన్స్‌. మేము ఎవరికీ తీసిపోం.. సోదరి నాతో రా.. మనం వెళ్దాం.. పోరాటం చేద్దాం” అంటూ పాట ప్రారంభంలో విజయ్‌ ఆగ్రహంతో చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఒకటిన్నర నిమిషంపాటు సాగిన ఈ వీడియో సాంగ్‌లో విజయ్‌.. తన ప్రత్యర్థిపై పోరాటం చేస్తున్న దృశ్యాలు చూపించారు.

Liger new song: Vijay Deverakonda nails his moves in 'Akdi Pakdi', netizens go crazy! | Movies News | Zee News

ఇందులో విజయ్ ముంబయి మురికివాడకు చెందిన యువకుడిగా, ఫుల్‌ మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన తల్లి పాత్రలో సీనియ‌ర్ న‌టి రమ్యకృష్ణ నటించారు. మైక్‌ టైసన్‌ కీలకపాత్ర పోషించారు. విజయ్‌ దేవరకొండ నటించిన మొదటి పాన్‌ ఇండియా సినిమా ఇది. ధర్మా ప్రొడెక్షన్స్‌, పూరీ కనెక్ట్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఆగస్టు 25న విడుదల కానుంది.

Related posts