telugu navyamedia
సినిమా వార్తలు

సందీప్ రెడ్డి వివాదంపై కంగనా సోదరి షాకింగ్ కామెంట్స్

Rangoli-and-Sandeep-Reddy-Vanga

“అర్జున్ రెడ్డి” చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సందీప్ వ్యాఖ్య‌ల‌పై మ‌హిళా లోకం భ‌గ్గుమంటోంది. ప‌లువురు హీరోయిన్లు, మ‌హిళా జ‌ర్నలిస్టులు సందీప్ వ్యాఖ్య‌ల‌పై అభ్యంతరం వ్య‌క్తం చేశారు. సందీప్ వంగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండ‌ద‌ని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించారు. అవికాస్తా వివాదానికి దారి తీయడంతో ఈ వ్యాఖ్య‌ల‌ను మీడియా త‌ప్పుగా అర్థం చేసుకుంద‌ని, ఎవ‌రినో కించ‌ప‌రిచే ఉద్దేశంతో తాను అలా అన‌లేద‌ని సందీప్ వివ‌ర‌ణ ఇచ్చారు. అయినప్పటికీ సందీప్ వ్యాఖ్య‌ల‌పై బాలీవుడ్ ర‌చ‌యితలు, ద‌ర్శ‌కులు, న‌టులు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ సోద‌రి రంగోలి సందీప్ రెడ్డి వంగాకు మద్దతుగా నిలవడం గమనార్హం. ఫెమినిస్ట్ ధోర‌ణిలో స్పందించే రంగోలి ఒక పాత సినిమాలోని రాజ్ కపూర్ లవ్ సీన్ బిట్‌ను త‌న ట్విట‌ర్ ఖాతాలో పోస్ట్ చేసింది. “అంద‌రూ లెజెండ్ అని కీర్తించే రాజ్ కపూర్ అప్పట్లోనే మోటు సరసం చేశాడు. మోటు సరసానికి అసలు సిసలు ఉదాహరణ ఇది. ఇదీ బాలీవుడ్ నిజ‌స్వ‌రూపం. రాజ్ కపూర్ ను బాలీవుడ్ లెజెండ్ అంటూ కీర్తించే మీరు ఒక దక్షిణాది దర్శకుడిని ఇలా విమర్శించడం ఎంత వరకు న్యాయం” అని ప్రశ్నించింది.

Related posts