telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను జగన్ అడ్డుకోలేరు: నారా లోకేష్

Lokesh Tdp

విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో ప్లాంట్‌ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందనే వార్తలతో… ఏపీలోని ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలు ఉక్కు ఉద్యమంలోకి దిగాయి. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్‌. సీఎం జగన్‌ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపలేరని పేర్కొన్నారు. “సీఎం జగన్‌ గారు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణని అడ్డుకోరు, ప్రతిపక్ష పార్టీలు పోరాడితే ఊరుకోరు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కంటూ ఏడు రోజులుగా ఉద్యమిస్తున్న పల్ల శ్రీనివాస్‌ గారి ఆమరణ నిరాహార దీక్షని వైకాపా ప్రభుత్వం కుట్రపూరితంగా భగ్నం చెయ్యాలని ప్రయత్నించడం దారుణం. విశాఖ ఉక్కు కాపాడుకోవడానికి ప్రాణత్యాగానికైనా సిద్ధం దీక్ష విరమించేది లేదంటూ ఉద్యమానికి ఊపిరిపోస్తున్న పల్లా గారి పోరాటం స్ఫూర్తిదాయకం.” అంటూ సీఎం జగన్‌పై నారా లోకేష్‌ నిప్పులు చెరిగారు. ఇక అంతకు ముందు ట్వీట్‌లో పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేసే అరాచకాలపైన లోకేష్‌ మండిపడ్డారు. “సీఎం జగన్‌ విధ్వంస పాలనకు ఇది పరాకాష్ట. పంచాయతీ ఎన్నికల్లో వైకాపాకి ఓటు వెయ్యలేదనే కారణంతో నరసరావుపేట నియోజకవర్గం, ఇస్సాపాలెం పరిధిలోని శిశుమందిర్ వద్ద ఇళ్ల ముందు డ్రైనేజ్, మెట్లు కొట్టేసిన చీప్ మెంటాలిటీ జగ్గూ గ్యాంగ్ ది. గోగులపాడు పంచాయతీలో అత్యధిక వార్డులను టిడిపి కైవసం చేసుకోవడం జీర్ణించుకోలేక స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు, పోలీసులు దగ్గర ఉండి ప్రజల పై దౌర్జన్యం చెయ్యడం దారుణం. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వైకాపా నాయకులకి ప్రజలు తగిన శిక్ష విధించే రోజు దగ్గర్లోనే ఉంది.” అంటూ లోకేష్‌ ఫైర్‌ అయ్యారు. 

Related posts