telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రాష్ట్రం అంత ఆయన పోస్టర్లతో నింపేసిన అభిమానులు…

ఉత్కంఠగా సాగిన బీహార్‌ ఎన్నికల్లో ఎందరో అంచనాలను తప్పని నిరూపిస్తూ ఎన్‌డీఏ విజయం సాధించి తనంటే పడనివారు ముక్కుపై వేలు వేసుకునేలా చేసింది. అయితే అక్కడ మొత్తం 243 సీట్లకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 125 సీట్లను కైవసం చేసుకొని విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే అందులోనూ బీజేపీ తన సొంతంగా 72 సీట్లను గెలిచింది. అయితే ఈ ఎన్నికల్లో ఎన్‌డీయేకు ఏమాత్రం తీసిపోనన్నట్లు ఆర్‌జేడీ గట్టి పోటీ ఇచ్చింది. అందులో కేవలం ఆర్‌జేడీ పార్టీ 75 సీట్లను గెలిచింది. ప్రస్తుతం రాష్ట్రంలో పోటీచేస్తున్న అతి పెద్ద పార్టీగా ఆర్‌జేడీ నిలిచింది. అయితే మహాఘట్‌బందన్ కూటమి మొత్తంగా 110 సీట్లను గెలిచింది. అందులో జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ 19 సీట్లతో సరిపెట్టుకుంది. దాంతో బీహార్‌ సీఎం సీటు మళ్ళీ నితీస్ వశమైంది. దాంతో రాష్ట్రంలోని ఎన్‌డీఏ అభిమానులు రాష్ట్రమంతటా నితీష్ గెలుపుకు సంబంధించి పోస్టర్లను అంటించి తమ ప్రేమను తెలుపుతున్నారు. ఈ పోస్టర్లపై నితీష్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ అనేక రకాలైన పోస్టర్లను అంటించారు. అయితే బీహార్‌లో ఎన్‌డీయే విజయం వెనుక బీజేపీ అండగా నిలిచిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

Related posts